భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ లో ఫేవరేట్ గా మారిపోయాడు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఓ పాకిస్తానీ టీ బ్రాండ్ వాణిజ్య ప్రకటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన ‘తాపల్’కంపెనీ టీ తాగుతూ... ‘‘టీ చాలా బాగుంది. థాంక్యూ..’ అంటూ ఇందులో కనిపిస్తుంది. ఈ వీడియో స్వల్ప వ్యవధిలోనే ట్విటర్, వాట్సాప్ సహా అన్ని సోషల్ మీడియా వేదికలపైనా నెటిజన్లు షేర్ చేసుకోవడం మొదలైంది. ఈ ప్రకటన పై నిజానిజాలు విచారించగా ఎవరో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తేలిందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa