పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగవేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ ఆస్తులను ప్రభుత్వం సీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాయ్‌గడ్ జిల్లాలోని అలీబాగ్‌లో ఉన్న నీరవ్ మోదీ బంగ్లాను అధికారులు పేల్చేశారు. సుమారు వంద కోట్ల విలువైన ఆ బిల్డింగ్ ముంబై తీరం సమీపంలో ఉన్నది. భారీ స్థాయిలో పేలుడు పదార్ధాలతో బిల్డింగ్‌ను పేల్చేశారు. సుమారు 33 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగ్లాను నిర్మించారు. కోస్టల్ జోన్ సూత్రాలను ఉల్లంఘించి ఆ బిల్డింగ్‌ను అక్రమంగా నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి చాలా పటిష్టమైన పునాదితో బిల్డింగ్‌ను నిర్మించారు. మెషీన్లతో కూల్చేందుకు కొన్ని నెలలు సమయం పడుతుంది కాబట్టి, దాన్ని డైనమేట్‌తో ధ్వంసం చేయాల్సి వచ్చింది. పేలుడు విజయవంతంగా పూర్తి అయినట్లు ఆ జిల్లా అధికారి చెప్పారు. వజ్రాల వ్యాపారి, బిలియనీర్ నీరవ్ .. పంజాబ్ బ్యాంకుకు సుమారు 13వేల కోట్లు రుణాలను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa