మిజోరం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. కేరళకు చెందిన బీజేపీ మాజీ చీఫ్ రాజశేఖరన్ అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ నేత శశిథరూర్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే రాజశేఖరన్ గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మే నెలలో మిజోరం గవర్నర్‌గా రాజశేఖరన్ బాధ్యతలు స్వీకరించారు. కేవలం పది నెలలు మాత్రమే ఆయన ఆ పదవిలో ఉన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ .. రాజశేఖరన్ రాజీనామాను ఆమోదించారు. అస్సాం గవర్నర్ జగదీశ్ ముఖీ.. మిజోరంకు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa