ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన ఆవిర్భావ సభ కమిటీ ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 11:24 AM

పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఆవిర్భావ సభ మార్చి 14న పిఠాపురంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించాక నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన వర్గాలు ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తాజాగా, జనసేన ఆవిర్భావ సభ సమన్వయ కమిటీని ప్రకటించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి ఈ కమిటీ పనిచేయనుంది. ఈ సమన్వయ కమిటీ... క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ, లాజిస్టిక్స్ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa