ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్మూ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 04:21 PM

శ్రీనగర్‌ : జమ్మూ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద బ్యాగును గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందం.. బ్యాగులో ఉన్న వస్తువులను బయటకు తీశారు. బ్యాగులో బ్యాటరీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రయాణికులను అప్రమత్తం చేసిన పోలీసులు.. భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్న జమ్మూ బస్టాండ్‌లో గ్రనేడ్‌ పేలడంతో 32 మంది గాయపడిన విషయం తెలిసిందే. వీరిలో నిన్న ఒకరు మృతి చెందగా, చికిత్స పొందుతూ ఇవాళ మరొకరు మృతి చెందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa