న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చ (ఎస్‌కేఎమ్) పార్టీతో కలసి తాము పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పష్టం చేశారు. శుక్రవారం పార్టీ కార్యలయంలో ఆయన మీడియాతో సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించారు. ఎస్‌కేఎమ్ పార్టీ నేతలు గురువారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని కలసి ఈ విషయంపై చర్చించినట్లు ఆయన వివరించారు. సిక్కింలో రెండు పార్టీలు కలసి పోటీ చేసే విషయంలో అవగాహన కుదిరిందన్న ఆయన.. సీట్ల విషయంలో మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. అయితే సిక్కింలో ఎస్‌కేఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa