కేరళ బీజేపీ మాజీ చీఫ్ అయిన రాజశేఖరన్ 2019 లోక్‌సభ ఎన్నికలతో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనుకుంటు న్నారన్న ఊహాగానాలు నిజమయ్యాయి. తొమ్మిది నెలల క్రితమే మిజోరాం గవర్నర్ గా ఇతను నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ పదవికి నేడు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు వ్యతిరేకంగా ఆయనను నిలబెట్టాలని బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. పార్టీ నిర్ణయం మేరకే రాజీనామా చేసినట్టు ఓ కేరళ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంలో రాజశేఖరన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa