ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభినందన్ కు 'పరమ్ వీర్ చక్ర' ..!

national |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 06:23 PM

అభినందన్ వర్ధమాన్ పేరు వింటే చాలు దేశభక్తి భావంతో జనం ఉప్పొంగిపోతున్న దృశ్యాలు ఈ మధ్య కనిపిస్తున్న విషయం తెలిసిందే. వీరోచిత పోరాటంతో పాక్ భూభాగంలోకి అడుగుపెట్టి అక్కడి సైన్యం చేతికి చిక్కినా మొక్కవోని ధైర్యంతో వ్యవహరించి మాతృభూమికి తిరిగొచ్చిన ధీరుడు అభినందన్. అసలు విషయానికొస్తే..తమిళనాడు ముఖ్య మంత్రి పళనిస్వామి ప్రధానికి లేఖ రాసారు. దీనిలో దేశ అత్యున్నత సైనిక పురస్కారమైన 'పరమ్ వీర్ చక్ర' గౌరవం అభినందన్‌కు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో అభినందన్ కి ఆ అత్యున్నత అవార్డ్ వచ్చే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరిన విషయం విథితమే.   


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa