ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఉమెన్స్ డే కానుక.. ఆర్టీసీ డ్రైవర్లుగా మహిళలు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 06:28 PM

మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఓ మహత్తర నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మహిళలను ఆర్టీసీలో డ్రైవర్లుగా నియమిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు  ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వం ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడతూ… ‘మహిళా ప్రగతిని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. పోలీస్ శాఖ, ఆర్టీసీలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాం.
నేడు సామాన్య మహిళలు అసాధారణ శక్తులుగా మారారు. ఇదెంతో హర్షించదగ్గ విషయం. డ్వాక్రా సంఘాల్లోని 98 లక్షల మంది మహిళలకు ఈరోజు రూ.3,500 చొప్పున అందించాం.  రాష్ట్ర అభివృద్ధికి డ్వాక్రా సంఘాలు ఎంతో సహకరించాయి. కోటి మంది సభ్యులుండే ఏకైక వ్యవస్థ డ్వాక్రా సంఘాలు. డ్వాక్రా సంఘాల ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెడతాం. కుటుంబ వ్యవస్థ భారతదేశానికి గొప్పవరం. ఎన్టీఆర్‌ మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. మహిళలకు తల్లిదండ్రుల ఆస్తిలో సమానహక్కు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారాయన. మహిళలకు తొలి  విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ తిరుపతిలో ఏర్పాటు చేశారు. రాజకీయాల్లోకి మహిళలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది’ అని అన్నారు చంద్రబాబు.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa