ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ లో చంద్రబాబుకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ మీద షాకులు ఇస్తూ వైసీపీలోకి వరుస క్యూలు కడుతున్నారు.ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని వైసీపీ లోకి వెళ్తున్నారన్న వార్తలు కూడా బయటకు వచ్చాయి,ఇటీవలే టీడీపీకి చెందిన మరో నేత చల్లా రామ కృష్ణా రెడ్డి టీడీపీని వీడి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇప్పుడు వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబుపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను వైసీపీ లోకి ఏ పదవి కూడా ఆశించకుండా నిస్వార్ధంగా వచ్చానని వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడం ఖాయమని తెలిపారు.దివంగత వై ఎస్ ఆర్ మాట ఇస్తే మాట తప్పడు మడమ తిప్పడు అదే బాటలో జగన్ కూడా ఇప్పుడు నడుచుకుంటున్నాడని తెలిపారు.ఇక చంద్రబాబుపై మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు వచ్చినా అప్పుడు కరువే వచ్చిందని,ఎప్పుడు లేదు చెప్పండి అంటూ ఈ సంవత్సరం రాయలసీమలో అయితే ఒక్క చినుకు కూడా పడలేదని అలాగే ఉత్తరాంధ్రలో అయితే పెద్ద తిత్లీ తుఫానే వచ్చిందని చంద్రబాబుపై చల్లా రెచ్చిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa