ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైఖేల్‌ జాక్సన్ ఇల్లు వేలానికి!

international |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 06:40 PM

పాప్‌ కింగ్‌ మైఖేల్‌ జాక్సన్‌ ఎంత ఇష్టపడి అపూరూపంగా కట్టించుకున్న ఇల్లు నెవర్‌ ల్యాండ్‌ మరోసారి వేలానికి వచ్చింది. ఈ సారి దాని ధరను అత్యంత తక్కువగా రూ.220 కోట్లుగా నిర్ణయించారు. 2015లో ఇదే ఇంటిని రూ.640 కోట్లకు వేలం పెట్టగా అంత రేటు పెట్టి కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మళ్లీ ఇపుడు తక్కువ రేటుకే వేలం పెడుతున్నట్లు ప్రకటించారు. మరి ఈ సారైనా కొనేందుకు ఎవరైనా ముందుకోస్తారో లేదో చూడాలి. నెవర్‌ ల్యాండ్‌, ఇల్లు మాత్రమే కాకుండా ఓ జూ, గార్డెన్‌, భారీ థియేటర్లు కూడా ఉండటం, అమెరికాలో నిర్మించడం వల్ల ఇప్పటి ధరల ప్రకారం చూస్తే రూ.220 కోట్లంటే తక్కువే అనుకోవచ్చు. అమెరికాలోని శాంటా బార్బరా దగ్గర్లో 2,700 ఎకరాల్లో తన అభిరుచికి తగ్గట్లు ఇంటిని కట్టుకున్నాడు మైఖేల్‌ జాక్సన్‌.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa