ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రూ.2841 కోట్లతో ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 06:43 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్‌ రంగాల్లో సుమారు రూ.2840.99 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ప్రకాశం జిల్లాల్లో కాగిత పరిశ్రమ స్థాపనకు ఆసియా పేపర్‌ పల్స్‌ పరిశ్రమ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాల్సిన్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ తిరుపతిలో రూ.734.47 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్‌ తయారీ యూనిట్‌ను స్థాపిస్తుంది. రెండు దశల్లో 13 ఎకరాల్లో స్థాపించే ఈ యూనిట్‌లో 1026 మందికి ఉపాది లభిస్తుంది. మూడేళ్లలో ఈ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. మెసర్స్‌ జీఎం మోడ్యూలర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ తిరుపతిలో రూ.133.65 కోట్ల పెట్టుబడితో ఒకే దశలో యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థలో 2230 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మెసర్స్‌ టెక్‌రీన్‌ బ్యాటరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో రూ.445.86 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమ 200 మందికి ఉపాది కల్పిస్తుంది. 
మెసర్స్‌ వీర్‌ ఓ మెటల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనంతపురం జిల్లా గూడిపల్లిలో రూ.41.94 కోట్లతో ఏర్పాటు చేసే పరిశ్రమలో 240 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మెస్సర్‌ వింగ్‌టెక్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫాక్చరింగ్‌ సెంటర్‌-2లో మూడు దశల్లో రూ.1031.07 కోట్లతో యూనిట్‌ స్థాపించింది. 10 వేల మందికి ఉపాది లభిస్తుంది. మెసర్స్‌ డిక్సన్‌ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్‌ తిరుపతిలో రూ.150 కోట్లతో సీసీటీవీ, డిజిటల్‌ వీడియో రికార్డర్లు, ఎల్‌ఈడీ టీవీలు, ప్యాన్లు, వాషింగ్‌ మెషిన్లు తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తుంది. ఇండస్‌ కాఫీ నాయుడు పేట ఎస్‌ఈజెడ్‌లో రూ.304 కోట్లతో ఎగుమతి మార్కెట్‌ కోసం ఫ్రీజర్‌ డ్రెడైకాఫీ ఉత్పత్తి చేస్తుంది.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa