భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయింది. చైనాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ తాయ్ జూ ఇంగ్ 21-15, 21-19తో సైనాను ఓడించింది. ఇంగ్ ఈ పోటీని కేవలం 37 నిమిషాల్లో ముగించింది. ఈ విజయంతో సైనాపై ఇంగ్ తన కెరీర్ రికార్డును 15-5కి మెరుగు పరచుకుంది.
2015లో ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ రన్నరప్ గా నిలిచిన సైనా ఇంతకు ముందు ప్రీ-క్వార్టర్ ఫైనల్ లో డెన్మార్క్ కి చెందిన హోజ్మార్క్ క్లాయేర్స్ ఫెల్ట్ ను 8-21, 21-16,21-13 తేడాతో, మొదటి రౌండ్ పోటీలో స్కాట్లాండ్ క్రీడాకారిని క్రిస్టీ గిల్మర్ ని 21-17, 21-18 తో ఓడించింది. భారత్ తరఫున ప్రకాష్ పదుకోన్, పుల్లెల గోపీచంద్ మాత్రమే ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ చెరోసారి నెగ్గారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa