ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వస్థలంపై క్షిపణి దాడి జరిగింది. క్రీవి రీహ్ లో జెలెన్ స్కీ జన్మించారు. క్రీవి రీహ్ లోని ఓ హోటల్ పై రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మృతి చెందారు. మరో 30 మంది గాయపడగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ కు అమెరికా మద్దతుగా ఉంది. అయితే, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ కు మిలిటరీ, ఇంటెలిజెన్స్ సాయాన్ని నిలిపివేశారు. ఈ తరుణంలో జెలెన్స్ స్కీ స్వస్థలంపై క్షిపణి దాడి జరగడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa