హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ.. లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుమారు మూడు గంటల పాటు నేతలు లోక్‌సభ ఎన్నికల గురించి విస్తృతంగా చర్చించారు. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ నేత కేజ్రీవాల్‌పై 3 లక్షల ఓట్లతో వారణాసిలో మోదీ నెగ్గారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కు కేవలం 75 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. అయితే లోక్‌సభ కోసం మోదీ పోటీ చేసే రెండవ నియోజకవర్గం ఏదన్న దానిపై మరికొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa