టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును టాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్ విజేత కౌశల్ శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలిశారు. . తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి కౌశల్ ముందుకు రావడాన్ని ముఖ్యమంత్రి ఆహ్వానించడంతో. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేస్తానని అన్నారు. త్వరలోనే తన భవిషత్తు కార్యాచరణను ప్రకటిస్తానని సీఎంకు కౌశల్ చెప్పారు. కౌశల్ ముందుగా మంత్రి గంటా శ్రీనివాసరావు ను కలుసుకున్నారు. ఆతనితో కలసి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పటికే కౌశల్ తెలుగుదేశం తరపున పార్లమెంటుకు పోటీచేయనున్నారని కథనాలు వస్తున్న తరుణంలో సిఎంతో భేటీ కావటం సర్వత్రా చర్చనీయాంశమైంది.