ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీకి గుడ్‌‌బై చెప్పే యోచనలో బొడ్డు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 01:19 AM

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంకు చెందిన టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేతలతో బొడ్డు చర్చలు జరిపారు. టీడీపీ నుంచి టికెట్‌ దక్కకపోవడంతో పార్టీ మారేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా.. టికెట్ విషయమై ఈనెల 6 వరకు అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తానని ఇదివరకే ఆయన ప్రకటించారు. అధిష్ఠానం నుంచి సానుకూల వైఖరి రాకపోవడంతో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa