కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లిలో శనివారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. మూడు ఆటోలు, ఓ స్కూలు బస్సును లారీ ఢీకొంది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. కాగా... స్కూలు బస్సును లారీ ఢీకొనడంతో పరీక్షలు రాసేందుకు వెళ్తున్న ఏడుగురు ఇంటర్ విద్యార్థినులకు గాయాలయ్యాయి. స్థానికులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa