ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీపీఆర్వో సాయిబాబా దారుణహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 11:44 AM

కర్నూలు: అదనపు డీపీఆర్వోను రాళ్ళతో దారుణంగా కొట్టిచంపిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆదోని సమాచారాశాఖ కార్యాలయం ఆవరణలో అడిషనల్‌ డీపీఆర్వో సాయిబాబా దారుణహత్యకు గురైన విషయం శనివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. ఆయన్ను కార్యాలయ ఆవరణలో రాళ్లతో కొట్టిచంపారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుండగా శనివారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. సాయిబాబా హత్యకుగల కారణాలు తెలియరాలేదు. ఆయన్ను ఎందుకు హతమార్చారన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa