మహిళలు విద్యాపరంగా రాణించడం ద్వారానే కుటుంబం, సమాజం అన్ని విధాల బాగుంటుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్లా రామాంజనేయులు తెలిపారు. ఈ మేరకు గ్రామాల్లో విద్యాభివృద్ధిపై కలెక్టరేట్ లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
మహిళల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకొని విద్యా, ఉపాధి పరంగా మహిళలు విజేతలుగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa