విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్రమంగా పోర్ట్ వాటాలు బదిలీ చేయించుకున్నారని విజయసాయిరెడ్డిపై కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు కావడంతో సీఐడీ విచారణకు సిద్ధమైంది.సీఐడీ కార్యాలయంలోకి విజయసాయి రెడ్డి మినహా ఇంకా ఎవరినీ అధికారులు లోపలకు అనుమతించలేదు. న్యాయవాదులకు కూడా అనుమతి లేదన్నారు. విజయసాయి రెడ్డి చెప్పే సమాధానాలపై వైసీపీ కీలక నేతల గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది. విచారణలో ఏం చెబుతారోననే వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావు ను బెదిరించి అక్రమంగా వాటాలను తీసుకున్న కేసులో విజయసాయిపై కేసు (Case) నమోదైంది.కేవీ రావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐడీ.. వైసీపీ నేత సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటు విజయసాయిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డిని ఏ-2గా, శరత్‌చంద్రారెడ్డి ఏ3గా ఉన్నారు. ఈ కేసులో ఈడీ కూడా కొన్నాళ్ల కిందట విజయసాయిని విచారించిన విషయం విదితమే.
![]() |
![]() |