అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో తలసేమియాపై చర్చ జరిగింది. తలసేమియా బాధితులకు ఆర్థిక సాయంపై సభ్యులు ప్రశ్నలు అడిగారు. తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆర్థికంగా అదుకోవాలని విశాఖపట్నం ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. తలసేమియా వ్యాధి గురించి మంత్రి సత్య కుమార్ సమాధానం చెప్పారు. తలసేమియా వ్యాధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. తలసేమియా బాధితులకు అన్ని విధాలా న్యాయం చేస్తున్నామని అన్నారు. ఆర్థికంగా పెన్షన్ సౌకర్యం కల్పించడంపై మరింత దృష్టి పెడతామని తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తలసేమియాపై సమీక్ష నిర్వహిస్తోందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
![]() |
![]() |