ఏపీ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సభ్యులు కొణతాల రామకృష్ణ, కాల్వ శ్రీనివాసులు అడిగారు. ఈ విషయంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హడావుడి చేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఒక జీఓ ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జర్నలిస్టుల హోసింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్‌గా దృష్టి పెట్టారని తెలిపారు. ఈ విషయంపై కోర్ట్‌ల డైరెక్షన్ కూడా ఉందని గుర్తుచేశారు. అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని న్యాయం చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
![]() |
![]() |