ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్నిమాపక సేవల శాఖలో 04 సీనియర్ ఫైర్ మాన్ పోస్టులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 09:46 PM

విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సేవల శాఖలో లో 204 సీనియర్ ఫైర్ మాన్ పోస్టులను లీడింగ్ ఫైర్ మాన్ గా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బొప్పరాజు  హృదయపూర్వక ధన్యవాదములు... తెలియ‌చేశారు.  విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సేవల శాఖలో లో గత 30 సంవత్సరాలుగా కనీసం  ప్రమోషన్ కూడా లేకుండా సర్వీసు చేస్తున్న సీనియర్ ఫైర్ మ్యాన్ ల కోసం 204  పోస్టులను లీడింగ్ ఫైర్ మాన్ గా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు గాను APJAC AMARAVATI చైర్మన్ బొప్పరాజు గారి ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సేవల శాఖ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి ఆర్ నాయుడు మరియు ఎన్ కోటేశ్వరరావు మరియు వారి కార్యవర్గ సభ్యలు కలసి గౌ.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా బొప్పరాజు గారు మాట్లాడుతూ మా JAC తరపున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లిన ఏ సమస్య పరిష్కారం చేయకుండా వదిలి పెట్టలేదని, అదేవిధంగా విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సేవల శాఖలో 204 మందికి ప్రమోషన్ కల్పించే విధంగా GO No.58 తేదీ 8.03.19 హోమ్ (పెన్షన్&ఫైర్ సర్వీస్) డిపార్ట్మెంట్ ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం  చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సేవల శాఖ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ 30 సంవత్సరాల మా కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి గారిని జీవితాంతం మర్చిపోలేమని తెలియచేసారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa