ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 12:04 PM

టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. కారు మాదాపూర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-45 మీదుగా చెక్ పోస్ట్‌ వైపు వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమయ్యాయి. అయితే, డ్రైవర్‌ అతివేగంతో పాటు నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com