టీడీపీ ఆవిర్భావం నుంచి సేవలు అందించిన వారిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఒకరు. మంత్రిగానూ ఆయన విశేష సేవలు అందించారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడుతూ.. పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని, లేదంటే విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. నిన్న శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించిన రోజు సీఎం చంద్రబాబు తనతో మాట్లాడారని, ఫలానా వారిని ఎంపిక చేశామని చెబితే స్వాగతించానని చెప్పారు. రెండుసార్లు తనకు శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పినట్టు పేర్కొన్నారు. రాజకీయాలు ఇప్పుడు ఖరీదైనవిగా మారిపోయాయని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని యనమల అభిప్రాయపడ్డారు.
![]() |
![]() |