శాసనసభ్యుల క్రీడా పోటీలకు స్టేడియంలో ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం స్టేడియంలో జరగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ తరపున పోటీలకు అవసరమైన ఏర్పాట్లకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని, అవసరమైన ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, ఇన్‌చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్‌బాబు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa