హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లోని తన నివాసంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బంబెర్ ఠాకూర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.ఈ దాడిలో ఠాకూర్, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు గాయపడ్డారని పోలీసు అధికారులు పిటిఐకి తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దాడి చేసిన వ్యక్తులు దాదాపు 12 రౌండ్ల బుల్లెట్లను కాల్చారు. దాడి జరిగిన వెంటనే, ఠాకూర్‌ను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి రిఫర్ చేయగా, పిఎస్‌ఓను ఎయిమ్స్ బిలాస్‌పూర్‌కు తరలించారు.మరిన్ని వివరాలు తెలియాల్సింది