హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. అనంతరం అక్కడ ఉన్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. కారు మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 మీదుగా చెక్‌పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమయ్యాయి. అయితే, డ్రైవర్ అతివేగంతో పాటు నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని.. పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్టు సమాాచారం. అయితే, ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరో హిట్ అండ్ రన్ కేసు
మరోవైపు, హైదరాబాద్‌లో ఇంకో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది. జగద్గిరిగుట్ట, షాపూర్‌లలో వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమైన కారు.. జగద్గిరిగుట్ట ఔట్ పోస్ట్ వద్ద ప్రయాణికులను గుద్ది ఆపకుండా వెళ్లిపోయింది. ఇదే కారు షాపూర్2లో మరి కొందర్ని సైతం ఢీకొట్టింది. ఈ ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడగా... వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ కారును ఆపేందుకు స్థానికులు వెంబబడి రాళ్లు రువ్వారు. అయినా, కారును ఆపకుండా నిందితుడు ముందుకెళ్లారు. ఈ ఘటనపై వేగంగా స్పందించిన జీడీమెట్ల ట్రాఫిక్ పోలీసులు.. సిగ్నల్ నిలిపి వేసి ప్రమాదానికి కారణమైన కారును పట్టుకున్నారు.
మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను స్థానికులుచితకబాదారు. కాగా, సురారం పోలీసులు హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని పోలీసులు, అధికారులు చెబుతున్నా తలకెక్కించుకోవడం లేదు. తాజాగా, తాగి కారు నడిపి పలువుర్ని ఢీకొట్టాడు. మళ్లీ ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
![]() |
![]() |