వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి లేదని వైయస్ఆర్‌సీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ సభలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైయస్ఆర్‌సీపీ నేతలు ఫైర్ అయ్యారు. వైయస్ఆర్‌సీపీ ఇచ్చిన అధికారంతో పదవి అనుభవించడమే కాకుండా.. కోవర్టు రాజకీయాలతో బాలినేని పార్టీని ఘోరంగా దెబ్బ తీశారని వైయస్ఆర్‌సీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ లో ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబుతో పాటు పలువురు సీనియర్ నాయకులు మీడియాతో మాట్లాడారు.
![]() |
![]() |