ప్రకాశం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డినే కారణమని వైయస్ఆర్‌సీపీ నేత, డిసిసి బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసు వెంకయ్య మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ సభలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాదాసు వెంకయ్య తీవ్రంగా ఖండించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో గ్రూపులు కట్టి పార్టీ ని బ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ ద్వారా రాజకీయాల్లో పైకొచ్చి ఇప్పుడు పిచ్చి ప్రేలాపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బాలినేని పోయాక వైయస్ఆర్‌సీపీలో స్వేచ్ఛ వచ్చిందని, మమ్మలి ఎప్పుడూ వైయస్ జగన్‌ను కలవనిచ్చేవాడు కాదని మండిపడ్డారు. వైయస్ జగన్‌ను ఓడించే స్థాయి నీది కాదని, అధికారం అనుభవించి.. కోట్లు పోగేసుకొని ఇప్పుడు పార్టీ మారి వైయస్ జగన్‌ను తిట్టడం దారుణమన్నారు. వైయస్ జగన్‌ను కించపరిచేలా మరోసారి మాట్లాడితే సహించేది లేదని వైయస్ఆర్‌సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఓంగోలు లో బాలినేని ఎలా గెలుస్తాడో చూస్తామని సవాలు విసిరారు.
![]() |
![]() |