ఐపీఎల్ 2024లో చివరివరకూ పోరాడి.. తృటిలో టైటిల్ చేజార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈసారి ఎలాగైనా టైటిలా సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ 2025 మెగా వేలం ద్వారా పటిష్టమైన జట్టును తయారు చేసుకున్న ఎస్‌ఆర్‌హెచ్.. జోరుగా సాధన చేస్తోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఫ్రాంఛైజీ.. ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది.
ఇక ప్రాక్టీస్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. ఇందులో సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఎస్‌ఆర్‌హెచ్-ఎ, ఎస్‌ఆర్‌హెచ్-బి జట్లగా విడిపోయి తలపడ్డారు. ఈ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్-ఎకు ప్రాతినిథ్యం వహించిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కిషన్.. అతడిని మించి స్కోరు చేశాడు.
ఈ క్రమంలో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును సాధించాడు ఇషాన్. మొత్తంగా 23 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కిషన్‌ను రూ.11.25 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఇషాన్ కిషన్ గత కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. కానీ మెగా వేలానికి ముందు అతడిని ఆ జట్టు వదిలేసింది. గతంలో ఇషాన్ కోసం ప్రయత్నించి విఫలమైన సన్‌రైజర్స్.. ఈసారి మాత్రం ఎట్టకేలకు జట్టులోకి తీసుకుంది.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్.. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో టైటిల్ వేటను ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు.
![]() |
![]() |