వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆ కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ముంబై నటి జెత్వానీ కోరారు. అప్పటి పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న 10 సెల్ ఫోన్లను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు కేసుల కారణంగా తన కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర హోం మంత్రి అనిత తనకు న్యాయం చేయాలని కోరారు. ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ తో సజ్జన్ జిందాల్, కుక్కల విద్యాసాగర్ తనను వేధిస్తున్నారని అన్నారు. మహిళా సంఘాల సమాఖ్య ప్రతినిధులు సుంకర పద్మశ్రీ, దుర్గా భవానీ, రమాదేవిలతో కలిసి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.కేసు విచారణను సీఐడీకి అప్పగించినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని జెత్వానీ చెప్పారు. ఇప్పటి వరకు ఫోరెన్సిక్ నివేదిక రాలేదని, తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టడానికి కారణమైన కుక్కల విద్యాసాగర్ బెయిల్ పై తిరుగుతున్నాడని. ఆయనను వెనుక నుంచి సజ్జన్ జిందాల్ నడిపిస్తున్నాడని చెప్పారు.
![]() |
![]() |