ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఘర్షణలు తీవ్రతరమవుతున్నాయి. ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతుండగా.. గాజాపై టెల్‌అవీవ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది.
సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో జరిపిన ఈ భీకర దాడుల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు కనీసం 330 మంది మృతిచెందినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.
![]() |
![]() |