మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు ఈ నెల 25వ తేదీన విజయసాయి రెడ్డి మళ్లీ విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. కాకినాడ సీ పోర్ట్, సెజ్ వ్యవహారంలో గత బుధవారం విచారణకు సీఐడీ అధికారులు పిలిచిన విషయం తెలిసిందే. విజయవాడ సీఐడీ కార్యాలయంలో 5 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. అవసరమైతే మళ్లీ రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. ఆ మేరకు విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మళ్లీ నోటీస్‌లు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa