కూటమి ప్రభుత్వం ఆదరణ పథకాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అవసర మైన వస్తువులను 90శాతం సబ్సిడీపై అందజేయనుంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభు త్వం అధికారంలో ఉన్న 1997-99 సంవత్సరంలో ఆదరణ-1, 2018-19లో ఆదరణ-2 ను అమలు చేసింది. 335 రకాల వృత్తిదారులకు వారికి అవసరమైన పరికరాలు అందజేసింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన అన్ని పథకాలను నిలిపేసింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ బీసీలకు మంచిరోజులు వచ్చాయి. ఆదరణ-3 పేరుతో కులవృత్తులతో జీవిస్తున్న వేలాది మంది బీసీలకు అవసరమైన వస్తువులను కొద్దిరోజుల్లోనే అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa