బంగాళాదుంపలలో పోషకాలు ఉంటాయని అవి తింటే ఆరోగ్యంగా ఉంటామని భావిస్తారు. అయితే బంగాళదుంప తినడం వల్ల అనేక చెడు ప్రభావాలు కలుగుతాయని చెబుతున్నారు. బంగాళదుంపల్లో ఉండే పోషకాలు అధికంగా తీసుకుంటే మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. బంగాళదుంపలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ b6 వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఇక వీటిని అధికంగా తీసుకోవడం చాలా హానికరం. ప్రతిరోజు బంగాళదుంప తినేవారు అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బంగాళదుంపలు ఎక్కువగా తింటే ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు వేధిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు బంగాళాదుంపలు తినకుండా ఉంటేనే మంచిది. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల అవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దోహదం చేస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది. బ్లడ్ షుగర్ ను పెంచుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు బంగాళదుంపలను తినకుండా ఉంటేనే మంచిది. ఇక బంగాళాదుంపలను తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. బంగాళదుంపలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ముఖ్యంగా వేయించిన, చీజ్ ఇతర పదార్థాలతో కలిపి తిన్న బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. కనుక వీటికి దూరంగా ఉంటేనే మంచిది . బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ ఏర్పడి తీవ్రంగా ఇబ్బంది పడతారు. బంగాళదుంపలను అధికంగా తీసుకోవడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. బంగాళదుంపలలో కొన్ని విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిలో మన శరీరానికి కావలసిన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు లేవు కనుక ఎక్కువగా తింటే అనారోగ్యమే .
![]() |
![]() |