ఐపీఎల్ నయా సీజన్ ఆరంభానికి మరో రెండ్రోజుల సమయమే ఉంది. దీంతో అన్ని జట్లు సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో పంజాబ్ టీమ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. ట్రోఫీ కోసం ఆటగాళ్లతో పాటు కోచ్ పాంటింగ్ కూడా పూజలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సారి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఐపీఎల్ 2024 టైటిల్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. దేశీ ప్లేయర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఈ జట్టుకు చాలా బలాన్ని చేకూరుస్తారు. ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్లను ఈ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. వీరితో పాటు బెస్ట్ కోచ్ రికీ పాంటింగ్‌ను ఎంపిక చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa