పామూరు పట్టణంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని చెత్త సంపద కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. చెత్త ద్వారా సంపదను తయారు చేయాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం చెత్త సంపద కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పంచాయతీ కార్యదర్శి అరవింద, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |