శాసనసభ సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. 16 రోజులపాటు శాసనసభలో ప్రతిపక్షం లేని సమావేశాలను టీవీల్లో చూడటానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో చాలా చప్పగా జరిగాయి. వైయస్ఆర్‌సీపీ సభ్యులు సభకు హాజరైతే సమాధానాలు చెప్పాల్సి వస్తుందని, తద్వారా వారి తప్పులు ప్రజలకు తెలుస్తాయని కూటమి ప్రభుత్వం భయపడింది. మా పార్టీ సభ్యులు సభకు రాకూడదనే ప్రభుత్వం కోరుకుంటోంది కాబట్టే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అదే సమయంలో మండలిలో ప్రధానపాత్ర పోషించాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాం. మండలి సమావేశాలకు మా పార్టీ సభ్యులు హాజరుకావడంతో మండలిపై ప్రజల్లో ఆసక్తి కనిపించింది. మా పార్టీ సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేసింది. జూలై 10న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన రివ్యూలో రూ. 14 లక్షల కోట్ల అప్పులున్నాయని లీకులిచ్చి ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేయించాడు. వైయస్ జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని దుష్రచారం చేశారు. జూలై 22న గవర్నర్ ప్రసంగంలో అప్పులు రూ. 10 లక్షల కోట్లని చెప్పించారు. నాలుగు రోజుల తర్వాత జూలై 26న రాష్ట్రం అప్పులు రూ. 12,93,261 కోట్లని ప్రభుత్వమే ప్రకటించింది. రాష్ట్రం అప్పులపై వైయస్ఆర్‌సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ రూ. 4,91,734 కోట్లని, ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు రూ.1,54,797 కోట్లని, మొత్తం కలిపితే రూ. 6.46 లక్షల కోట్లని రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఎట్టకేలకు తాము చెప్పినవన్నీ అబద్ధాలేనని పరోక్షంగానైనా ఒప్పుకోక తప్పలేదు అని అన్నారు.
![]() |
![]() |