ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట కోల్డ్ స్టోరేజ్ అగ్నిప్రమాదంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు ఎవరు దిక్కు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వమా, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యమా సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నష్టం ఎంత అనేది తేల్చాలన్నారు. కోల్డ్ స్టోరేజ్ పై మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపించిందని విమర్శించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే వరకు వైయస్ఆర్‌సీపీ వారికి అండగా నిలుస్తుందని తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు.
![]() |
![]() |