మయన్మార్ దేశం ఇవాళ భారీ భూకంపం దాటికి విలవిల్లాడింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత గరిష్ఠంగా 7.7గా నమోదైంది. భూకంపం ధాటికి మయన్మార్ లో 25 మంది మృతి చెందారు. భారీ భవనాలు నేలమట్టం కాగా, శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. పలువురికి గాయాలయ్యాయి. అటు, మయన్మార్ రాజధాని నేపిడాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భూ ప్రకంకపనల ప్రభావంతో మాండలే నగరంలో ఐకానిక్ వంతెన కూడా కూలిపోయింది. దేశంలో పలు చోట్ల ఎత్తయిన ప్రార్థనా మందిరాలు, గోపురాలు కూలిపోయాయి. భూకంపం నేపథ్యంలో, మయన్మార్ సైనిక ప్రభుత్వం అంతర్జాతీయ సాయం కోరింది. మానవతా దృక్పథంతో సాయం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది.
![]() |
![]() |