ఉప్పల్ వేదికగా నిన్న రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 190 పరుగులు చేయగా... 191 పరుగుల లక్ష్యాన్ని ఎల్ఎస్‌జీ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో లక్నో పాయింట్ల ఖాతా తెరిచింది. అయితే, సన్‌రైజర్స్ తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ చేసిన పని తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి నితీశ్ కుమార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 28 బంతులాడి 32 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ హెల్మెట్‌ను ఆగ్రహంగా మెట్లపైకి విసిరికొట్టాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
![]() |
![]() |