డైట్ అంటే చాలా మందికి బోర్ అనిపిస్తుంది. మన కళ్ల ముందు ఫుడ్ ఉండి కూడా మనం తినలేం. బరువు ఎలా అయినా తగ్గాలనుకునేవారు ఇలాంటి కఠినమైన డైట్‌ని ఫాలో అయితారు. కొన్ని రోజులు ఏం జరిగినా బరువు తగ్గాలని స్ట్రిక్ట్‌గానే చేస్తారు. కానీ, కొన్నిరోజులకి బోర్ కొట్టేసి డైట్‌ని తీసి పక్కనపెట్టేస్తారు. ఇప్పుడు చెప్పే 5 :2 డైట్ అనేది అలా కష్టంగా ఉండదు. హ్యాపీగా చేయొచ్చు. అసలు దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే వారంలో ఐదు రోజులు ఫుల్‌గా తినేస్తారు. మిగిలిన రెండు రోజులు మాత్రం 500 నుంచి 600 కేలరీలకి మించి తినరు. ఐదురోజులు హ్యాపీగా తినొచ్చు. రెండు రోజులు మాత్రం కష్టపడితే చాలని చాలా మంది ఈ డైట్ చేస్తారు. దీని వల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయని ఫాలో అవుతున్నారు. మరి ఈ డైట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఎలా చేయాలి
ఈ డైట్‌లో వారానికి 5 రోజులు సాధారణంగానే తింటారు. కేలరీల గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మిగిలిన రెండు రోజుల్లో మాత్రం రోజువారీ అవసరాల్లో నాలుగో వంతు కేలరీలను తగ్గిస్తారు. అంటే ఆడవారు 500 కేలరీలు, మగవారు 600 కేలరీలను తీసుకోవచ్చు. ఈ రెండు రోజులు కూడా మీకు నచ్చిన రెండురోజులని చూస్ చేసుకోవచ్చు. అయితే, రెండు రోజులు ఒకేసారి కలిపి చేయకుండా మధ్యలో ఒకరోజు నార్మల్‌గానే ఉండి మరోరోజు ఫాస్టింగ్ చేయాలి. వివరంగా చెప్పాలంటే రెండు రోజులు కలిపి ఫాస్టింగ్ చేయకూడదు. ఎలా అంటే ఉదాహారణకి సోమ, గురువారం ఫాస్టింగ్ అనుకోండి. ఆ రెండు రోజుల్లో చెప్పిన కేలరీలు మాత్రమే తీసుకోండి. మిగతా వారాల్లో నార్మల్‌గా తినొచ్చు.
ఏం తినాలి
తినడమంటే ఏదైనా తినాలని కాదు. జంక్ ఫుడ్ తింటే ఎప్పటికీ బరువు తగ్గలేరు. ఉపవాసం ఉండకపోయినా సరే హెల్దీ ఫుడ్ తినాలి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి హెల్దీ ఫుడ్స్ తినాలి. హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. మిగతా రెండు రోజులు మాత్రం ఏం తిన్నా 500 కేలరీలు దాటకుండా చూసుకోండి. దీని వల్ల కేలరీలు తగ్గించడమే కాకుండా శరీర జీవక్రియ బలంగా మారుతుంది.
డ్రింక్స్
ఈ డైట్ చేసేటప్పుడు ఆకలిని కంట్రోల్ చేయడానికి నీరు, హెర్బల్ టీ, బ్లాక్ కాఫీ వంటివి తీసుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్ వంటివి మనం ఉపవాసం లేని రోజులో తింటే హెల్దీగా ఉంటాం. దీంతో పాటు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
లాభాలు
అధ్యయనాల ప్రకారం ఈ డైట్ చేయడం వల్ల కేలరీలని తగ్గించుకోవచ్చు. దీంతో బరువు తగ్గుతారు. దీంతోపాటు ఇన్సులిన్ స్థాయిల్ తగ్గుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆస్తమా, సీజనల్ అలర్జీలు, మెనోపాజ్ టైమ్‌లో వచ్చే వేడి ఆవిర్లు, హార్ట్ అరిథ్మియా వంటి సమస్యలు తగ్గుతాయి. వీటితో పాటు శరీర బరువు, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ లెవల్స్ తగ్గుతాయి.
ఫాస్ట్‌గా బరువు తగ్గేందుకు
ఈ డైట్ కారణంగా బరువు తగ్గుతారు. అయితే, ఎఫెక్టివ్‌గా బరువుతగ్గాలంటే ఉపవాసం లేని రోజుల్లో ఎక్కువగా తినకుండా బ్యాలెన్స్‌డ్‌గా తినాలి. ఐదురోజులు ఫుల్‌గా తిని రెండు రోజుల మాత్రం స్ట్రిక్ట్ డైట్ చేస్తే తగ్గడం కష్టం. కాబట్టి అలా కాకుండా నార్మల్ రోజుల్లో కూడా మోడరేట్‌గా తినండి.
ఫాస్టింగ్‌లో ఎలా తినాలి
ఉపవాసం ఉండే రోజుల్లో ఇలానే తినాలనే నియం లేదు. కొంతమంది కొద్దిపాటి బ్రేక్‌ఫాస్ట్ చేస్తే మరికొంతమంది ఆలస్యంగా తింటారు.
మూడుసార్లు కొద్దికొద్దిగా తినడం..లేదా రెండుసార్లు ఎక్కువగా తినడం.
కేలరీల సంఖ్య తెలుసుకాబట్టి, వాటి ప్రకారం మీ డైట్‌ని ఫాలో చేసుకోండి. కడుపు నిండుగా అనిపించేందుకు పోషకాలు, ఫైబర్, ప్రోటీన్‌తో నిండి ఉండే ఫుడ్ తినండి. మొదట్లో కష్టంగా అనిపిస్తుంది. రాన్రాను చాలా సులువుగా చేస్తారు. అయితే, ఎప్పటికీ మీ వెంట ఏదైనా హెల్దీ స్నాక్ ఉంచుకోవడం మంచిది.
ఎవరు చేయకూడదు
ఈ డైట్ హెల్దీ అయినప్పటికీ కొంతమంది చేయకపోవడమే మంచిది.
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గేవారుగర్భిణీలు, పాలిచ్చే తల్లలు, పిల్లలు, డయాబెటిస్ ఉన్నవారుపోషకాహార లోపం ఉన్నవారు, తక్కువ బరువు ఉన్నవారు. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నవారు. చేయకపోవడం మంచిది.
అయితే, మిగతావారు ఎవరు చేసినా ముందుగా డాక్టర్‌ని సంప్రదించడం మంచిదని గుర్తుంచుకోండి.
![]() |
![]() |