తెలుగు దేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనమని... పార్టీ మొదటి గెలుపు ఒక చరిత్ర అని మంత్రి నారా లోకేష్ అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ సభలో మంత్రి మాట్లాడుతూ... రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా.. వాటిని బద్దలు కొట్టాలన్నా టీడీపీకే సాధ్యమన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని... తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. 43ఏళ్ల క్రితం టీడీపీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్ అని తెలిపారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి చూపించారన్నారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూశామని... ఎన్నో సంక్షోభాలు చూశామని, ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తి జెండాను దించకుండా పార్టీకి కాపు కాసింది పసుపు సైన్యం అని అన్నారు. పార్టీ కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారని.. వారే మన ధైర్యమన్నారు. పార్టీ కోసం కష్టపడిన పసుపు సైన్యానికి లోకేష్ హ్యాట్సాప్ తెలియజేవారు. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుడని ఎన్టీఆర్ అన్నారని... పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అదే స్ఫూర్తితో పనిచేస్తున్నామని తెలిపారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ అన్నారు. దేశానికి అభివృద్ధి అంటే ఏంటో చూపింది చంద్రబాబు అని చెప్పారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తెలిసేలా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే తెలుగు వారిని ప్రపంచ పటంలో పెట్టింది పార్టీ అధినేత చంద్రబాబు అని వెల్లడించారు. రూ.2 కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పెన్షన్ వంటి అనే సంక్షేమ కార్యక్రమాలను దేశానికి పరిచయం చేసింది టీడీపీ అని చెప్పుకొచ్చారు. యువకులను రాజకీయాలకు ప్రోత్సహించింది తెలుగుదేశం అని అన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది, బీసీలకు ఆర్థికంగా రాజకీయ స్వాతంత్ర్యం తీసుకువచ్చింది టీడీపీనే స్పష్టం చేశారు.
![]() |
![]() |