హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ కు మధ్య వివాదం నెలకొన్ని సంగతి తెలిసిందే. హెచ్సీఏ ఒత్తిడి, వేధింపులను తట్టుకోలేకపోతున్నామంటూ సన్ రైజర్స్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉచిత టికెట్ ల కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు ముఖ్యంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బెదిరిస్తున్నారని తెలిపింది. ఇలాగైతే తాము హైదరాబాద్ ను వదిలి వెళ్లిపోతామని హెచ్చరించింది. కోరినన్ని ఫ్రీ పాసులు ఇవ్వనందున ఓ మ్యాచ్ లో తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్ కి తాళాలు వేశారని హెచ్సీఏ కోశాధికారికి సన్ రైజర్స్ లేఖ రాశారు. ఆ లేఖ ప్రతి తమ వద్ద ఉందంటూ ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఏపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏపీకి రావాలని ఆంధ్ర క్రికెట్ సంఘం ఆహ్వానించింది. తక్కువ అద్దెకు విశాఖ స్టేడియంను ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. ఏపీ ప్రజలు కూడా తమ రాష్ట్రానికి ఐపీఎల్ ఫ్రాంఛైజీ లేకపోవడాన్ని వెలితిగా ఫీల్ అవుతున్నారు.
![]() |
![]() |