రేపల్లె ఆర్టీసీ డిపోలో 10 నూతన బస్సులను మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనగాని మాట్లాడుతూ, రేపల్లె డిపో నుంచి తిరుపతికి బస్సు సర్వీసులను ప్రారంభించామని, ఇకనుంచి తిరుపతికి నేరుగా రేపల్లె నుంచి వెళ్లవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజారవాణాకు, ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
![]() |
![]() |