జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణంకు ప్రమాదం తప్పింది. సోమవారం ఆయన ఖమ్మం నుండి సత్తుపల్లికి కారులో వెళ్తుండగా వీ. వీ. పాలెం వద్ద ఖమ్మం- వైరా ప్రధాన రోడ్డులో గేదె అడ్డుగా వచ్చింది. ఆ గేదెను తప్పించే క్రమాన దాన్ని ఢీకొట్టగా వాహనం ముందు భాగంలో దెబ్బతిన్నప్పటికీ అందులో ఉన్న నాగభూషణం, అతని భార్య స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. వీరి వాహనం ఢీకొన్న గేదె మృతి చెందింది.
![]() |
![]() |