గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కోర్టు ఈరోజు విచారించనుంది. ఇదే కేసులో జయసుధకు గత డిసెంబర్ 30న కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కింది కోర్టు ఇచ్చిన బెయిల్ ను పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ ఏ1గా ఉన్నారు. ఏ2గా మానస్ తేజ్, ఏ3గా కోటిరెడ్డి, ఏ4గా మంగారావు, ఏ5గా బాలాంజనేయులు, ఏ6గా పేర్ని నాని ఉన్నారు. పేర్ని నానికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం పేర్ని నాని బెయిల్ పై ఉన్నారు.
![]() |
![]() |