ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అగ్నిమాపక విభాగంలో డీజీగా పనిచేసిన సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ సంజయ్‌పై ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో ఏపీ సర్కార్ సవాల్ చేసింది. దీనిపై జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈరోజు (మంగళవారం) విచారించింది. సంజయ్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సంజయ్‌కు సుప్రీం నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో ఈ నోటీసులకు సమాధానం చెప్పాలంటూ.. తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే అంశాలను సుప్రీం కోర్టు ముందు ఏపీ ప్రభుత్వం ఉంచింది. సంజయ్‌పై అప్పట్లోనే అవినీతి నిరోధక చట్టంలో పలు సెక్షన్ల కింద ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌ను ఏసీబీ చేర్చింది. ఫైర్ డీజీగా విధులు నిర్వహించిన సమయంలో సంజయ్ ఈ అవినీతికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత సంజయ్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తరువాత నివేదికను ఏసీబీకి పంపించింది. ప్రాథమిక సాక్షాధారాలు ఉండటంతో సంజయ్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
![]() |
![]() |